ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్
SRD: మొగుడంపల్లి మండలం మీర్జంపల్లి తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ సుభాష్ పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, కూలీలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధికి ఈ పనులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.