VRS తీసుకొని ఎన్నికల్లో పోటీ.. చివరికి నిరాశే..!

VRS తీసుకొని ఎన్నికల్లో పోటీ.. చివరికి నిరాశే..!

SRPT: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా ఆయనకు పరాజయం తప్పలేదు. పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు నిరాశే మిగిలింది.