VIDEO: కీసరను కుదిపేసిన వడగళ్ల వాన
NTR: కంచికచర్ల మండలాన్ని అకాల వర్షం వణికించింది. ముఖ్యంగా కీసర గ్రామంలో కురిసిన వడగళ్ల వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలో మునిగింది. రహదారులు జలమయమై వాహనదారులు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడి తోట, మొక్కజొన్న పంట రైతులు ఈ గాలి వానకు నష్టం వాటిల్లింది.