విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

బిక్కవోలు: పందలపాకలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పందలపాక, తోస్సిపూడి, కొమరిపాలెం, కొంకుదురు, ఆరికరేవుల తదితర గ్రామాల్లో ఎన్నో ఏళ్ల నుంచి లోవోల్టేజ్ సమస్య ఉందని చెప్పారు. ఇకపై ఆ కష్టాలు ఉండవని తెలియజేశారు.