ఆలయంలో జాతీయ పతాకానికి పూజలు

SRD: ఆపరేషన్ సింధూరం విజయవంతం కావాలని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం ఛైర్మెన్ చంద్రశేఖర్, EO శివ రుద్రప్ప, మాజీ జెడ్పీ ఛైర్మన్ పాటిల్, అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశం మేరకు భారత సైన్యానికి మద్దతుగా, దేశం సుభిక్షంగా ఉండాలని సంగమేశ్వర స్వామి వద్ద జాతీయ పతాకాన్ని ఉంచి అభిషేకం చేశారు.