పేకాట శిబిరాలపై దాడి .. ముగ్గురు అరెస్ట్

పేకాట శిబిరాలపై దాడి .. ముగ్గురు అరెస్ట్

కృష్ణా: బందరు టౌన్ సీఐ కె. యేసు బాబు విశ్వసనీయ సమాచారం మేరకు పెదపట్నం గ్రామ శివారు ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. అక్రమ జూదంపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సీఐ ప్రజలను కోరారు.