VIDEO: ఎంవీఐ కార్యాలయంలో తుప్పు పడుతున్న వాహనాలు
KDP: పులివెందులలోని స్థానిక ఎంవీఐ కార్యాలయ ఆవరణంలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలు తుప్పు పడుతున్నాయి. చాలా ఏళ్ల నుంచి కార్యాలయంలో వాహనాలు అక్కడే ఉండడంతో తుప్పు పట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వాహనాలు తుప్పు పడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తుప్పు పట్టిన వాహనాలకు బహిరంగ వేలం పాట నిర్వహించాలని స్థానికులు అంటున్నారు.