గుంతల మయంగా నర్సంపల్లి రోడ్డు.!
MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద గుంతల మయంగా తయారైంది. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి - నర్సంపల్లి గ్రామాల మధ్య కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. రైల్వే లైన్ కారణంగా బ్రిడ్జి నిర్మాణం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణం చేయడంతో గుంతల మయంగా తయారయింది.