పెద్దమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం

పెద్దమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం

BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం పూజలు జరిపారు. పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి ముందుగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. అలాగే పంచ హారతులు, నివేదన, నీరాజనం మంత్రపుష్పం తదితర పూజలు చేశారు.