అనకాపల్లిలో యోగాపై ఉపాధ్యాయుల అవగాహన ర్యాలీ

AKP: యోగా ప్రయోజనాల గురించి జిల్లాలో ప్రతి స్కూల్ విద్యార్దులకు తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం అనకాపల్లి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయులు అవగాహన సదస్సు, అనంతరం పట్టణంలో యోగాంధ్ర ర్యాలీ చేశారు.