VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్నఅగ్నికి ఆహుతి
MHBD: బయ్యారం మండలం కస్తూరి నగరం గ్రామ శివారులో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ధరావత్ సురేష్, లూనావత్ హచ్యాకు చెందిన పంట కోత దశలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చేతికి వచ్చే పంట కాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.