'పోరాట యోధుల ఆశయాలకు మరణం ఉండదు'

VZM: ప్రజా పోరాటాల యోధుల దేహాలకి తప్పా వాళ్ళ ఆశయాలకు మరణం ఉండదని జిల్లా CPI సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. ఆదివారం DNR అమర్ భవన్‌లో అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణరావు 99వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతో మంది కమ్యూనిస్టు నాయకులను తయారు చేశారన్నారు.