ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
HNK: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా ఇవాళ హన్మకొండలోని డీసీసీ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. MLA నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.