VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. స్థిరంగా పత్తి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 19,800, నాన్ ఏసీ మిర్చి రూ. 19,550, పత్తి ధర రూ. 8,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 300.. నాన్ ఏసీ మిర్చి ధర రూ. 250 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.