రేపు అనంతసాగరం మండలంలో ఆనం పర్యటన

NLR: ఆత్మకూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం అనంతసాగరం మండలంలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా రైతాంగ రబీ రెండవ పంటకు సంబంధించి IAB సమావేశపు నిర్ణయాల మేరకు బుధవారం ఉదయం 9:30 గంటలకు సోమశిల రిజర్వాయర్ నుండి మంత్రి ఆనం నీటిని విడుదల చేస్తారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.