రేపు పాతబస్తీకి ప్రపంచ అందగత్తెలు

రేపు పాతబస్తీకి ప్రపంచ అందగత్తెలు

HYD: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా రేపు HYDలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సుల్లో సుందరీమణులను ఓల్డ్ సిటీకి తీసుకొస్తారు. చార్మినార్ వద్ద గ్రాండ్ వెల్కమ్ అనంతరం హెరిటేజ్ వాక్ ఉంటుంది. లాడ్ బజార్, చౌమహల్ల ప్యాలెస్‌ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శిస్తారు. రద్దీ ప్రదేశంలో ఈవెంట్ నిర్వహిస్తుండటం పట్ల ఆసక్తి నెలకొంది.