VIDEO: పెళ్లి మోసం.. నలుగురిపై కేసు నమోదు

VIDEO: పెళ్లి మోసం.. నలుగురిపై కేసు నమోదు

WGL: పర్వతగిరి చౌటుపల్లికి చెందిన దేవేందర్‌రావు అక్టోబర్ 24న మ్యారేజ్ బ్యూరో సూచనతో ఇందిరాను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఫోన్ పరిశీలించగా గతంలోనే పెళ్లి అయి ఒక పాప ఉన్న విషయం బయటపడింది. ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపారని దేవేందర్ ఫిర్యాదు చేయడంతో సోమవారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.