VIDEO: 'సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'
NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్‌లో వరుస దొంగతనాల నేపథ్యంలో నవీపేట్ ఎస్సై తిరుపతి శుక్రవారం కిరాణా షాపు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను అదుపు చేయవచ్చని, నేరస్తులను త్వరగా గుర్తించవచ్చని ఎస్సై వివరించారు. భద్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.