48 గంటల లోపే ధాన్యం సొమ్ము జమ: వీరవల్లి
W.G: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపే సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వీరవాసరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ వీరవల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం వీరవాసరంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు.. రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.