సింహ వాహనోత్సవంపై జంబుకేశ్వరుడి దర్శనం
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండుగల కొనసాగుతున్నాయి. రెండో రోజు స్వామి వారు సింహ వాహనోత్సవంపై భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పురోహితులు రామకృష్ణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. పురవీధుల్లో భక్తులు అడుగడుగునా స్వామికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.