మక్తల్ బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌

మక్తల్ బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌

NRPT: జాబ్ క్యాలెండర్ విడుదల, ఎన్నికల హామీల అమలు కోసం 'ఛలో అసెంబ్లీ' ముట్టడికి వెళ్తున్న మక్తల్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జుట్ల సాగర్, శివారెడ్డి, రఘు, ఆనంద్, రాజు, సాదిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. నాయకులు అక్రమ అరెస్టుల వల్ల ఉద్యమాన్ని ఆపలేరని, నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.