కొత్తవలసలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

కొత్తవలసలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

VZM: కొత్తవలస వెలుగు మండల కార్యాలయం ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో విజన్ బిల్డింగ్ పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలపై మండల కార్యవర్గ సభ్యులకు వివరించారు. క్లస్టర్ చేపడుతున్న చార్ట్‌లను వారిని అడిగి తెలుసుకున్నారు. లక్ష్యం ఏర్పాటుపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.