VIDEO: సూపరిపాలన సభకు అగ్రనేతల హాజరు
అన్నమయ్య: ఆదివారం మదనపల్లిలో దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బీహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అటల్-మోదీ సూపరిపాలన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.