రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అన్నమయ్య: పీలేరు మండలం వేపుల బైలు పంచాయతీ వద్ద కొత్త హైవేపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వనజ (40)అనే మహిళ మృతి చెందింది. మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ఆమెను ఢీకొట్టింది. కారు డ్రైవర్, బంధువులు కలిసి ఆమెను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిని నిర్ధారించారు. పీలేరు ఎస్సై లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.