హత్య కేసులో విచారణ ముమ్మరం

హత్య కేసులో విచారణ ముమ్మరం

బాపట్ల: అప్పికట్ల గ్రామంలో తల్లిదండ్రులను కన్నకొడుకు శుక్రవారం అర్థరాత్రి హత్య చేశాడు. ఆస్తి పంపకంలో విభేదాలు రావడంతో కొడుకు కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ మేరకు శనివారం ఉదయం బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, రూరల్ ఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం మృతుల బంధువులతో మాట్లాడి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు.