13న ఒంగోలు రానున్న పీసీసీ చీఫ్ షర్మిల

13న ఒంగోలు రానున్న పీసీసీ చీఫ్ షర్మిల

ప్రకాశం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి యాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 5:30 గంటల సమయంలో ఆమె ఒంగోలులో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా చెప్పారు. జిల్లా పార్టీలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.