పెనుగంచిప్రోలులో గోడకూలి ఇద్దరు మృతి
NTR జిల్లా పెనుగంచిప్రోలులో శుక్రవారం విషదం చోటుచేసుకుంది. గుమ్మడిదూరులో డ్రైనేజీ కాలువ తవ్వుతుండగా పక్కనే ఉన్న పాత గోడ కూలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కలపల స్వరోజిన(60), ఆకుల యేసు(55) అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.