ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి

ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి

TG: వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చింద్రవేణి అనూష డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా.. ఐదు రోజుల క్రితం వైద్యులు డెలివరీ చేశారు. ఈరోజు బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబీకులు నిరసన చేపట్టారు.