విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో  ఎద్దు మృతి

KRNL: కోసిగి మండలం పెండేకల్లు ఫీడర్ పరిధిలోని నర్సగేని రైతులకు చెందిన రూ. లక్ష విలువైన ఎద్దు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున సమీప పొలంలో సరైన ఎత్తులో లేని విద్యుత్ తీగలు గట్టుపై మేత మేస్తున్న ఎద్దుకు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధిత రైతు లక్ష్మీ ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు.