'నాతవరం ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ'

AKP: నాతవరం ఎస్సైగా సీహెచ్.భీమరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఎస్సై రామారావు పరవాడ బదిలీ కావడంతో ఆయన స్థానంలో భీమరాజు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల కాపాడుతూ ప్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.