VIDEO: 'జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించాలి'
KMM: జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించాలని DYFI రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ పేర్కొన్నారు. దాడికి నిరసనగా గురువారం DYFI, SFI పాలేరు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వరంగల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. మతోన్మాదుల దుశ్చర్యలు నశించాలన్నారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు