కమలాపురంలో 14న బండలాగుడు పోటీలు

కడప: కమలాపురం మండలం రామాపురంలోని శ్రీ మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో బండలాగుడు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనున్నాయి. ఈనెల 14న సాయంత్రం 3 గంటలకు జరిగే పోటీల్లో న్యూ వృషభ రాజులు పాల్గొంటారని ఆలయ ధర్మకర్త కాశీభట్ల సాయినాథ్ శర్మ తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా రూ. 50 వేలు అందజేయనున్నారు.