ఎల్పీజీ సరఫరాపై కేంద్రం భరోసా
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఉందని వార్తలు వస్తున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోందని చెప్పింది. ఈ విషయంలో వినియోగదారులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. దేశంలో రిఫైనరీల గ్యాస్ ఉత్పత్తి 38 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. అలాగే సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా DAC విధానాన్ని కేంద్రం తెచ్చింది.