ప్రతి ఏడాది మూడు వేల ప్రమాదాలు: వీసీ సజ్జనార్

ప్రతి ఏడాది మూడు వేల ప్రమాదాలు: వీసీ సజ్జనార్

HYD: ప్రస్తుతం హైదరాబాద్‌లో సంవత్సరానికి సుమారు 3 వేల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో 300 మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.