VIDEO: భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని ఉయ్యాల సేవలు

SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఉన్న శ్రీ రాధా గోవిందస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి స్వామివారికి ఉయ్యాల సేవ భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఈ సేవలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.