రేషన్ దుకాణాల వద్ద సర్వర్ సమస్య.. గంటల తరబడి నిరీక్షణ

రేషన్ దుకాణాల వద్ద సర్వర్ సమస్య.. గంటల తరబడి నిరీక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం రేషన్ బియ్యం పంపిణీ సందర్భంగా దుకాణాలు జనంతో కిక్కిరిశాయి. 3నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో, లబ్ధిదారులు 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. సర్వర్ సమస్యల కారణంగా వేలిముద్రలు పడక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది పంపిణీ వేగవంతం చేయాలన్నారు.