వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

BPT: బాపట్ల పట్టణం వివేకానంద కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు మహిళలను, ఒక పురుషుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.