పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

WNP: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగవద్దని, చెరువులు, బావుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.