VIDEO: ఇంటి పరిసరాల్లో ప్రత్యక్షమైన నాగుపాము

VIDEO: ఇంటి పరిసరాల్లో ప్రత్యక్షమైన నాగుపాము

NTR: తిరువూరు మండలం ఏరుకోపాడు గ్రామంలో సోమవారం మన్నే శ్రీనివాసరావు స్వగృహంలో సుమారు ఐదు అడుగుల నాగుపాము కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ జయప్రకాశ్‌కు సమాచారం అందించగా ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని జాగ్రత్తగా పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో అందరు ఊపిరీ పీల్చుకున్నారు.