ఉచితాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు ఇవ్వండి మేము తిరుగుతామని మహిళలు అడిగారా? ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది తన అభిప్రాయమని అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు.