శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

TPT: తలకోనలోని శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.