కాళేశ్వరం వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు ప్రారంభం
BHPL: జిల్లాలో రైతులకు మద్దతు ధర (MSP) సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఆయన ప్రారంభించారు. నియమావళి ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.