'HPV వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి'
BHNG: చౌటుప్పల్ మండల పరిధి పంతంగిలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఇవాళ హెచ్పీవీ వాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. చినుకని శివప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండిన బాలికలు HPV వాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాక్సిన్‌పై అపోహలు పట్టించుకోవద్దని పేర్కొన్నారు.