VIDEO: పొగాకు గొడౌన్‌లో చెలరేగిన మంటలు

VIDEO: పొగాకు గొడౌన్‌లో చెలరేగిన మంటలు

ప్రకాశం: టంగుటూరులోని కొండపి రోడ్డులో గల బెల్లం కోటయ్య పొగాకు గొడౌన్‌కి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. GPI కంపెనీకి గూడెం లీజుకి ఇవ్వగా వారు గతేడాది కొనుగోలు చేసిన వేల క్వింటాళ్ల పొగాకును అందులోనే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.