శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NDL: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని నంది కొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చన చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతు పండించిన పసిడి, పాడి పంటలు బాగుండలని ఆయన స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.