'స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం'

'స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం'

ప్రకాశం: స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోరా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణ గ్రామాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. స్వర్ణ గ్రామం వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చామని వెల్లడించారు.