నందిగామలో డీజీ లక్ష్మీ సెంటర్‌ ప్రారంభం

నందిగామలో డీజీ లక్ష్మీ సెంటర్‌ ప్రారంభం

ఎన్టీఆర్: నందిగామ గాంధీ సెంటర్లో మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో డీజీ లక్ష్మీ సెంటర్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు మెప్మా చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. డీజీ లక్ష్మీ సెంటర్ ద్వారా మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణలు అందుబాటులోకి వస్తాయన్నారు.