అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRD: నూతన ఆలయాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఉదయం గ్రామస్తులు అయ్యప్ప స్వామి దేవాలయ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు.