VIDEO: జడ్పీ హై స్కూల్‌లో త్రాచుపాము కలకలం.!

VIDEO: జడ్పీ హై స్కూల్‌లో త్రాచుపాము కలకలం.!

KKD: పెద్దాపురం(M) ఆర్.బీ. పట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలోకి త్రాచుపాము రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ఆ పామును కొట్టి చంపినట్లు సమాచారం. స్కూల్ ఒక వైపు పొలాలకు ఆనుకుని ఉండి, ప్రహరీ గోడ లేకపోవడంతో తరచూ పాములు ఆవరణలోకి వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.