'ఆటో , క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి'

VZM: ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకం అమలవుతున్న కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు నష్టపోతారని, ఈ మేరకు వాహన మిత్ర పథకం అమలు చెయ్యాలని ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎన్.వై.నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం సాలూరులో ఆటో డ్రైవర్లు CITU ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి డ్రైవర్‌కు 15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.